ANANTHAPURAM GOOD MORNING AP
అనంతపురం జిల్లా
ఇది రాయలసీమ గర్వం అనంతపురం!
ఇక్కడి కొండలలో లేపాక్షి పరిసర ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ.
పెనుకొండ కొండపై ఉన్న కోట చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది.
రాతి పర్వతాలు, పొడి భూములు ఈ ప్రాంత స్వభావం.
ఇప్పుడు సౌరశక్తి ప్రాజెక్టులతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.
చరిత్ర, ప్రకృతి కలిసిన నేల ఇది.
అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
జలజీవన్ మిషన్ కింద భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం
ఉరవకొండకు రూ.480 కోట్లు, రాయదుర్గానికి రూ.390 కోట్లు మంజూరు
వచ్చే 30 సంవత్సరాల పాటు తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక ప్రణాళిక
అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీర్చేందుకు జలజీవన్ మిషన్ కింద భారీగా నిధులు కేటాయించింది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు 480 కోట్ల రూపాయలు, రాయదుర్గం నియోజకవర్గానికి 390 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు వచ్చే 30 సంవత్సరాలపాటు తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టనున్నారు. జలజీవన్ మిషన్‌లో భాగంగా పీఏబీఆర్ నుంచి పైపులైన్ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేలా ప్రాజెక్ట్ రూపొందించారు. అలాగే విడతల వారీగా అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా జలజీవన్ మిషన్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.
