KONASEEMA GOOD MORNING AP
కోనసీమ జిల్లా – ఇంట్రో
ఇది కోనసీమ జిల్లా!
గోదావరి నది చుట్టూ విస్తరించిన పచ్చని భూభాగం.
ఇక్కడ పెద్ద కొండలు లేకపోయినా ప్రకృతి అందాలు అపారం.
కొబ్బరి తోటలు, చిన్న చిన్న ద్వీప గ్రామాలు ప్రత్యేకత.
నదీ మార్గాల్లో బోటు ప్రయాణం పర్యాటకులకు ఆకర్షణ.
ప్రకృతి సోయగాలకు ఇది చిరునామా
సముద్రతీర ప్రాంతంలో తాబేళ్ల పిల్లలను విడిచిపెట్టిన జిల్లా కలెక్టర్
తాబేళ్ల గుడ్లను సేకరించి ఇంక్యుబేషన్ భద్రపరచిన అటవీశాఖ అధికారులు
ఈ ప్రక్రియలో ఐదు దశలు ఉంటాయని మహేష్ కుమార్ వెల్లడి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నీళ్ళరేవు పరిసర ప్రాంతాలలో సుమారు 50 వేల గుడ్లు సేకరించి ఇంక్యుబేషన్ సెంటర్లో 45 రోజులు భద్రపరచగా తొలి దశలో 300 తాబేలు పిల్లలు జన్మించాయని వాటిని సముద్రంలో విడిచిపెట్టినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. తాబేళ్ల సంరక్షణలో ఇంక్యుబేషన్ సెంటర్ల పాత్ర చాలా కీలకమైనదన్నారు. తీర ప్రాంతాల్లో దొరికిన గుడ్లను సురక్షితంగా పిల్లలుగా మార్చే ప్రక్రియ హ్యాచరీ మేనేజ్‌మెంట్ అటవీశాఖ విభాగం చేపట్టిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా ఐదు దశలు ఉంటాయన్నారు. కృత్రిమ గూళ్ళ నిర్మాణం ఇంక్యుబేషన్ సెంటర్‌లో సహజ సిద్ధమైన గూడును పోలి ఉండేలా ఇసుకలో గుంతలు తవ్వడం జరుగుతుందన్నారు. సాధారణంగా 1.5 నుండి 2 అడుగుల లోతులో, పైభాగం ఇరుకుగా మరియు అడుగు భాగం వెడల్పుగా కుండ ఆకారంలోఉండేలా గూడును సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు.
