ANANTHAPURAM GOOD MORNING AP
అనంతపురం జిల్లా – వింతలు, విశేషాలు
భారతదేశంలోనే పెద్ద జిల్లా అయిన అనంతపురం (పాత జిల్లా విభజన ముందు) చారిత్రక ప్రాధాన్యం కలిగింది.
లేపాక్షి ఆలయం ఇక్కడి ప్రముఖ చారిత్రక కట్టడం.
లేపాక్షి నంది విగ్రహం భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహాలలో ఒకటి.
గ్రౌండ్‌నట్ సాగుకు అనంతపురం ప్రసిద్ధి.
పెద్ద ఎత్తున సౌరశక్తి ప్రాజెక్టులు ఇక్కడ ఏర్పడ్డాయి
అనంతపురంలో రెండో రోజు కొనసాగిన ఏసీబీ సోదాలు
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు
ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు
బిల్డింగ్ ప్లాన్లను ఎలాంటి కారణం చూపకుండా హోల్డ్ చేసినట్లు ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ల టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. మొత్తం 13 జిల్లాల్లో నిర్వాహకుల నిర్వహణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రిజిస్టర్లు సరిగా మెయింటైన్ చేయడం లేదని అధికారులు గుర్తించారు. అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ నేతృత్వంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఈ సోదాలు జరిగాయి. బిల్డింగ్ పర్మిషన్లలో అవకతవకలు, అక్రమాలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తూ అధికారులు ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్లను ఎలాంటి కారణం చూపకుండా హోల్డ్ చేసినట్లు, మరికొన్ని చోట్ల ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లు సోదాల్లో బయటపడింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.
