RAYALASEEMA GOOD MORNING AP
నల్లమల కొండలు రాయలసీమ సహజ సంపద.
ఈ పర్వత ప్రాంతాల్లో అడవులు, లోయలు విస్తరించి ఉన్నాయి.
బెలుమ్ గుహలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.
యాగంటి ప్రాంతం కూడా కొండల మధ్య ఉన్న పవిత్ర క్షేత్రం.
ప్రకృతి, చరిత్ర కలిసిన ప్రాంతం ఇదే.
కర్నూలు జిల్లా ఆదోని పట్ణణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు
తరచూ మరమ్మత్తులకు గురవుతున్న ఎస్ఎస్ ట్యాంక్
శాశ్వత మరమ్మత్తుల కోసం 40 కోట్లు మంజూరు చేయాలని నివేదికలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజలకు తాగునీటిని అందించడంలో కీలకమైన ఎస్ఎస్ ట్యాంక్ తరచూ మరమ్మత్తులకు గురవుతుంది. ఇప్పటికే మూడుసార్లు మరమ్మత్తుల పేరిట కోట్ల రూపాయలు వెచ్చించిన ఫలితం లేకపోవడంతో తాజాగా ఆదోని మున్సిపల్ చివరి సమావేశంలో మళ్లీ మరమ్మత్తుల కోసం 90 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మత్తుల వలన పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేక పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాశ్వత మరమ్మత్తుల కోసం 40 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ నిధులు మంజూరైతే తప్ప ఆదోని పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కాదని ప్రజలు భావిస్తున్నారు. దీనిపై మా రాయలసీమ స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు.
