KADAPA GOOD MORNING AP
కడప జిల్లా – వింతలు, విశేషాలు
గండికోటను “భారతదేశ గ్రాండ్ క్యానియన్”గా పిలుస్తారు.
పుష్పగిరి క్షేత్రం చారిత్రక ఆలయ సముదాయం.
సిద్ధవటం కోట చారిత్రక కట్టడం.
పెన్నా నది ఈ జిల్లాకు ముఖ్య జలవనరు.
రాయలసీమ చరిత్రలో కడపకు ప్రత్యేక స్థానం ఉంది.
మత్తు పదార్థ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు..
మార్చి 17, 18 తేదీల్లో జిల్లావ్యాప్తంగా జనచైతన్య జీపు జాతా నిర్వహణ
మత్తు పదార్థాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని డీవైఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 17, 18 తేదీల్లో జిల్లావ్యాప్తంగా జనచైతన్య జీపు జాతా నిర్వహించనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కార్యాలయంలో జీపు జాతా పోస్టర్లను డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ఆవిష్కరించారు.
యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యం కల్పించడం ఈ జాతా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాల మాఫియాను కట్టడి చేయాలని, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17న బద్వేల్లో ప్రారంభమై మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం మీదుగా ప్రయాణించి 18న కడపలో ముగుస్తుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు.
