CHITTOOR
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా రాయలసీమ దక్షిణ భాగంలో ఉంది.
తూర్పు ఘాట్ కొండలు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
స్వర్ణముఖి నది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది.
కొండలు, లోయలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం.
పర్వత ప్రాంతం–మైదానాలు కలిసిన భౌగోళిక స్వభావం చిత్తూరు ప్రత్యేకత
చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం కలకలం
మేక, దూడలను అడవిలోకి లాక్కెళ్లిన చిరుత
గ్రామంలోకి చిరుతలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
చిరుత వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్న రైతులు
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామ శివారులలో రెండు చిరుతలు కనిపించడంతో గ్రామస్తుల్లో భయభ్రాంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవల గౌస్ బాషాకి చెందిన ఆవుపై ఒక చిరుత దాడి చేయడంతో ఆవు మృతిచెందింది. మరో ఘటనలో చెరువు పక్కలో మేత మేస్తున్న దూడలను, మేకలను అడవిలోకి లాకెళ్లిందని రైతులు చెబుతున్నారు.
ఓటేరుపాలెం, నల్లగుట్లపల్లి వద్ద చిరుత సంచారం ఎక్కువగా ఉందని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. చిరుతలు గ్రామంలోకి రాకుండా కట్టుదిట్టం చేయాలని, జరిగిన నష్టానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి గ్రామ శివారులలోకి చిరుతలు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వానికి కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు.
