SRIKAKULAM
శ్రీకాకుళం జిల్లా
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకమైన ఆహార సంస్కృతి కనిపిస్తుంది.
సముద్రతీర ప్రాంతం కావడంతో చేపల వంటలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి.
చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీత కూరలు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి.
గ్రామీణ ప్రాంతాల్లో జొన్న రొట్టె, పప్పు వంటలు కూడా విస్తృతంగా చేస్తారు.
సాదాసీదా పదార్థాలతో చేసినా ప్రత్యేక రుచితో నిలిచే వంటలు శ్రీకాకుళం జిల్లా ఆహార ప్రత్యేకత.
డయేరియా కేసుల విషయంలో సాధారణ స్థితికి వచ్చిన అధికారుల తీరు
ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టిన సిబ్బంది
అధికారులు స్పందించి తాగునీటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
మొన్నటి వరకు డయేరియా కేసుల విషయంలో హడావుడి చేసిన అధికారులు మళ్లీ నిమ్మకు నీరెత్తినట్లు తయారయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మురుగునీరు కుళాయి పైపు లైన్లలోకి వెళ్లకముందే అధికారులు తాగునీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుని ఉంటే అతిసారా బారినపడి అమాయక ప్రజలు ప్రాణాలు విడిచేవారు కాదని ప్రజలు భావిస్తున్నారు.
ఇంత జరిగినా నగరంలో తాగునీటి పైపులైన్ల దుస్థితి ఏమాత్రం మారలేదని.. పైపులైన్లు ఇంకా మురుగు కాలువల్లోనే దర్శనమిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


