NELLOR
నెల్లూరు జిల్లా
నెల్లూరు అంటే ముందుగా గుర్తొచ్చేది నెల్లూరు చేపల పులుసు.
కారం, చింతపండు రుచితో ఉండే ఈ వంట ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
రొయ్యల వేపుడు, చేపల కూరలు ఇక్కడి ప్రత్యేక వంటలు.
తీరప్రాంతం కావడంతో సముద్ర ఆహారం విస్తృతంగా వాడుతారు.
కారం ఎక్కువగా ఉండే రుచికరమైన వంటలకు నెల్లూరు ప్రసిద్ధి.
బిట్రగుంటలో ప్రసన్నుడి తెప్పోత్సవంలో అపశృతి
తెప్పోత్సవ సమయంలో పుష్కరిణిలో ఒరిగిన తెప్ప
అప్రమత్తమై పడిపోకుండా పట్టుకున్న మోతకారులు
పడవలపై పరిమితికి మించి ఎక్కడమే కారణమని ఆరోపణలు
నెల్లూరు జిల్లా బిట్రగుంటలో జరిగిన ప్రసన్నుడి తెప్పోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పుష్కరిణిలో తెప్ప ఒరిగిపోవడంతో మోతకాపరులు అప్రమత్తమై స్వామివారి ఉత్సవ మూర్తులను నీటిలో పడిపోకుండా పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. దేవేరులతో కొలువుదీరిన ప్రసన్న వేంకటేశ్వరస్వామిని మేళతాళాలతో పుష్కరిణి దగ్గరకు తీసుకువచ్చారు.
తెప్పలో కొలువుదీర్చే సమయంలో ఆకస్మికంగా నీరు చేరడాన్ని గమనించిన మోతకాపులు వెంటనే అలర్ట్ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, అర్చకులు సంప్రోక్షణ చేయించి పుష్కరిణి గట్టుపై ఊరేగింపు నిర్వహించి.. కొండపైకి చేర్చారు. పడవలపై పరిమితికి మించి ఎక్కడమే ఈ పరిస్థితికి కారణమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెప్ప ఒరిగిన ఉదంతంపై విచారణ జరుపుతున్నామని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు.
