EAST GODAVARI GOOD MORNING AP
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉంది.
గోదావరి నది పాయలు ఈ జిల్లాలో విస్తరించాయి.
పాపికొండలు ఈ ప్రాంత భౌగోళిక ఆకృతి.
డెల్టా మైదానాలు తూర్పు భాగంలో ఉన్నాయి.
చిన్న కాలువలు, చెరువులు నీటి వనరులుగా ఉన్నాయి.
నది–పర్వత ప్రాంతాల కలయిక తూర్పు గోదావరి ప్రత్యేకత.
వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన పుడ్ కమిషన్ సభ్యురాలు
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారం పరిశీలన
తనిఖీలలో లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు
విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆదేశం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, పలు ప్రాంతాల్లోని వసతి గృహాలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం పాఠశాల , సంక్షేమ వసతి గృహాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాలా దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, అల్పాహారం, వసతి గృహాల్లోని ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
విద్యార్థులు సరైన పోషకాహారం అందుకుంటున్నారా అనే అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తనిఖీలలో లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఐసీడీఎస్ కేంద్రాల్లో విద్యార్థులు సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఫుడ్ కమిషన్ సభ్యురాలు అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.
