SATYASAI GOOD MORNING AP
శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా రాయలసీమ మైదాన ప్రాంతంలో ఉంది.
డెక్కన్ పీఠభూమిలో ఈ జిల్లా భాగంగా ఉంది.
చిన్న కొండలు, గుట్టలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
పొడి వాతావరణం ఈ ప్రాంత లక్షణం.
చిన్న వాగులు, చెరువులు నీటి వనరులుగా ఉన్నాయి.
పీఠభూమి–మైదాన భూభాగం శ్రీ సత్యసాయి ప్రత్యేకత.
కదిరిలో వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
భారతదేశంలో పేరుగాంచిన మూడవ అతిపెద్ద రథోత్సవం
భక్తజన సందోహంతో అత్యంత వైభవంగా కొనసాగిన బ్రహ్మ రథోత్సవం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధానఘట్టం బ్రహ్మరథోత్సవం లక్షలాదిమంది భక్త జన సందోహం మధ్య అత్యంత వైభవోపేతంగా కొనసాగుతోంది. రథంలో ఆసీనులైన నరసింహునిపపైన దౌనం,మిరియాలు చళ్ళితే సకల పాపాలు తొలగి అష్ట, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని భక్తుల నమ్మకం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు.
