EAST GODAVARI
తూర్పు గోదావరి జిల్లా
గోదావరి నీటిసంపదతో సాగు విస్తరించిన తూర్పు గోదావరి జిల్లా అన్నపూర్ణగా నిలిచింది. చమురు, గ్యాస్ వనరులు ఆర్థిక శక్తిని పెంచుతున్నాయి. ఈ జిల్లా తాజా అంశం ఇప్పుడు.
రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరో మహిళ మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సూర్యకుమారి
పాలలలో స్వచ్ఛతపై పరిశీలన చేయాలని అధికారులు ఆదేశాలు
యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించిన వైద్యులు
ఇటీవల రాజమహేంద్రవరంలో కలుషితమైన పాలు తాగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం పాల కల్తీపై దృష్టిసారించింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా వివిధ ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు సేకరించి సరఫరా చేసే పాలలో స్వచ్ఛతపై పక్కాగా పరిశీలన చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
తాజాగా రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో మరో మహిళ మృతి చెందింది. పాలు తాగిన వారి రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు అసాధారణంగా పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. సూర్యకుమారి అనే మహిళ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ మరణించిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ కే.వి.వి సత్యనారాయణ అందిస్తారు.


