ELURU GOOD MORNING AP
ఏలూరు జిల్లా – వింతలు, విశేషాలు
కొల్లేరు సరస్సు ఈ జిల్లాలో ప్రముఖ ప్రకృతి సంపద.
కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
ఆక్వా కల్చర్ ఈ ప్రాంతంలో విస్తృతంగా జరుగుతుంది.
పంటల ఉత్పత్తిలో ఈ జిల్లా ముందుంది.
పక్షుల వలసలకు ఇది ముఖ్య కేంద్రం.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన మహిళ ప్రసవ వేదనలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా సమయానికి శస్త్ర చికిత్స చేయలేదని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నవజాత శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీ అందిస్తారు.
