NELLORE GOOD MORNING AP
నెల్లూరు జిల్లా – వింతలు, విశేషాలు
పులికాట్ సరస్సు భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు.
వలస పక్షులకు ఇది ముఖ్య ఆశ్రయం.
కృష్ణపట్నం పోర్ట్ ప్రముఖ వాణిజ్య కేంద్రం.
నెల్లూరు చేపల పెంపకానికి ప్రసిద్ధి.
రంగనాథ స్వామి ఆలయం ఈ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం
నెల్లూరు జిల్లాలో ప్రారంభంకానున్న మరో కీలక పరిశ్రమ
పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్..
భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ
పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్
30 ఎకరాల్లో రూ.100 కోట్లతో పరిశ్రమ నిర్మాణం
నెల్లూరు జిల్లాలో మరో కీలక పరిశ్రమ ప్రారంభంకానుంది. భారత నావికాదళాన్ని సాంకేతికపరంగా మరింత బలోపేతం చేయడం, తీర ప్రాంత రక్షణ ప్రధాన లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంగణంలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ రూపుదిద్దుకోనుంది. ఈ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నెల్లూరు జిల్లా బోగోలు మండలం లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సందర్శించనున్నారు. అనంతరం భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 30 ఎకరాల్లో ఈ పరిశ్రమను 100 కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టనున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ అందిస్తారు.
