ELURU GOOD MORNING AP
ఏలూరు జిల్లా – ఇంట్రో
ఇది ఏలూరు జిల్లా!
కొల్లేరు సరస్సు ‘అయ్యో ఎంత పెద్దదో’ అనిపించేలా ఉంటుంది.
వలస పక్షులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తాయి.
ఆక్వా కల్చర్ కూడా ఇక్కడ ‘బాగా అభివృద్ధి’ చెందింది.
ప్రకృతి సంపదకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.”
TOPS:
ఏలూరు జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు
ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచన
కార్పొరేషన్ అధికారులకు ప్రజలకు సహకరించాలని హితవు
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అధికారులతో కలిసి పరిశీలించిన బడేటి చంటి
ELURU GOOD MORNING AP
అందరి సమిష్టి కృషితో రానున్న వేసవిలో ఏలూరు నియోజకవర్గ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని కార్పొరేషన్ అధికారులకు సహకరించాలని హితవు పలికారు. ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటినీ అందించేందుకు దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పంపు హౌస్ షెడ్ నిర్మాణ పనులు, మోటర్లు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఉన్న నీటి నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నగర ప్రజలు ఎవరూ మంచినీటి సమస్యను ఎదుర్కొనకూడదన్న ఉద్దేశ్యంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద గండి పూడ్చి వేసే పనులను శరవేగంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.
