Goodachari 2: అడివి శేష్ (Adivi sesh) హీరోగా తెరకెక్కుతున్న గూఢఛారి-2పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను వినయ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తికాకముందే ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భారతీయ సినిమా రంగాన్ని ఈ సినిమా మరోస్థాయికి తీసుకెళ్తుందని దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తెలిపారు. సాధారణంగా అడివి శేష్ తన సినిమాలను దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత తనకు చూపిస్తారని.. కానీ ‘G2’ విషయంలో మాత్రం 70 శాతం షూటింగ్ పూర్తైన ఎడిట్ వెర్షన్‌ను చూపించారని పేర్కొన్నారు. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత తాను షాక్‌కు గురయ్యానని ఆయన చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉన్నాయని రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు. భారీ యాక్షన్‌తో పాటు మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని అన్నారు. ‘G2’ ఇండియన్ స్పై థ్రిల్లర్ జానర్‌కు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఇమ్రాన్ హష్మీ తన క్లాస్ స్వాగ్తో ఆకట్టుకున్నారని, వామికా గబ్బి కూడా అద్భుతంగా నటించారని రాహుల్ ప్రశంసించారు. మరి ఈ భారీ స్పై థ్రిల్లర్ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.


