ANANTHAPURAM GOOD MORNING AP
అనంతపురం జిల్లా
ఎండలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో వేరుశెనగ ప్రధాన పంటగా సాగుతుంది.
రైతులు జొన్న, సజ్జలు, సూర్యకాంతి పంటలు కూడా పండిస్తారు.
పొడి వాతావరణానికి అనుకూలమైన పంటలు ఇక్కడ ఎక్కువగా సాగుతాయి.
వేరుశెనగ ఉత్పత్తిలో అనంతపురం రాష్ట్రంలో ముందుంటుంది.
వ్యవసాయం రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలం
అనంతపురం జిల్లాలో అంగరంగవైభవంగా జరిగిన గుత్తికోట ఉత్సవాలు
14,15 తేదీల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
రాష్ట్రప్రభుత్వం తరుపున 50 లక్షల రుపాయల నిధులు కేటాయింపు
పర్యాటక స్థలంగా గుత్తి కోటను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ
అనంతపురం జిల్లాలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 14,15 తేదీల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుత్తి కోట ఉత్సవాలు 2026 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. రాబోయే రోజుల్లో పర్యాటక స్థలంగా గుత్తి కోటను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. గుత్తి కోట సుమారు 1300 సంవత్సరాల చరిత్ర కలిగినదని, గుత్తి కోట అభివృద్ధి, సంరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. కర్ణాటక హంపీ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో అదే విధంగా గుత్తి కోట ఉత్సవాలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. చారిత్రక గుత్తి కోట ఉత్సవాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.
