KADAPA
కడప జిల్లా
కడప ప్రాంతంలో రాయలసీమ రుచులు కనిపిస్తాయి.
రాగి సంకటి, మటన్ కూరలు ప్రసిద్ధి.
కారంగా ఉండే పచ్చళ్ళు ఎక్కువగా వాడుతారు.
పల్లె సంస్కృతి ప్రతిబింబించే వంటలు కనిపిస్తాయి.
సాంప్రదాయ రుచులతో కడప ఆహారం ప్రత్యేకతను కలిగి ఉంది.
సర్వేయర్ల నిరసన కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
పే స్కేల్ అమలు చేయాలంటూ గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్ల డిమాండ్
నిరసనల మధ్య సర్వేయర్ హరినాథ్ రెడ్డి సస్పెన్షన్ పై ఆగ్రహం
సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని అధికారులకు వినతి
అవసరమైతే విజయవాడ ధర్నా చౌక్‌లో పోరాటం చేస్తామని హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్వేయర్ సిబ్బంది నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సర్వేయర్లు మాట్లాడుతూ.. తాము ఆరు సంవత్సరాల క్రితం విధుల్లోకి వచ్చామని తెలిపారు. తమతో పాటు నియమితులైన ఇతర సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం పే స్కేల్ అమలు చేస్తున్నప్పటికీ సర్వేయర్లకు మాత్రం వర్తింప చేయకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
పొలాల్లో రేయి పగలు తేడా లేకుండా పనిచేస్తూ పాము కాట్లు వంటి ప్రమాదాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ సమస్యలపై నిరసన తెలుపుతున్న సమయంలో, సర్వేయర్‌ను సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు. ఆ సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే విజయవాడ ధర్నా చౌక్‌లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు.
