KONASEEMA GOOD MORNING AP
కోనసీమ జిల్లా – ఇంట్రో
ఇది కోనసీమ జిల్లా!
పచ్చని కొబ్బరి తోటలు చూస్తే ‘అయ్యో ఎంత అందంగా ఉందో’ అనిపిస్తుంది.
గోదావరి మధ్యలో చిన్న చిన్న ద్వీప గ్రామాలు ప్రత్యేక ఆకర్షణ.
బోటు ప్రయాణాలు పర్యాటకులకు ‘బాగా నచ్చే’ అనుభవం.
సాంప్రదాయ వంటకాలు, సంస్కృతి ఇక్కడ ‘చాలా ఫేమస్’ బాబోయ్!”
TOPS:
అంబేద్కర్ కోనసీమ జిల్లాపై ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం
కొబ్బరి పరిశ్రమ, ఆక్వారంగం రైతులకు తీవ్ర నష్టం
గణనీయంగా పడిపోయిన కొబ్బరి, రొయ్యల ధరలు
ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు
రైతుల భవిష్యత్తును కాపాడటానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
KONASEEMA GOOD MORNING AP
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న తీవ్ర యుద్ధ ప్రభావం అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పడింది. ఈ యుద్ధ ప్రభావంతో వ్యవసాయం, కొబ్బరి పరిశ్రమ, ఆక్వా రంగం పై ఆధారపడి జీవనం సాగించుకునే రైతులు, కార్మికులు భారీ నష్టాలకు గురయ్యారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతులు నిలిచిపోవడంతో కొబ్బరి, ఆక్వా ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ సంక్షోభంలో రైతులు కుదేలైపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమను రక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ ద్వారా విదేశాలకు కొబ్బరి ఉత్పత్తులు, రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసింది. సముద్ర మార్గాలు మూసివేయబడటం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. కాకినాడ పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న వందలాది టన్నుల కొబ్బరి ఉత్పత్తులు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని రైతులు కోరుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సందర్శన చేసి, పరిస్థితిని అంచనా వేసి తమను ఆదుకోవాలని అంటున్నారు. యుద్ధం ఆగిపోకపోతే, జిల్లా ఆర్థికంగా మరింత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతుల భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు.
