RAYALASEEMA GOOD MORNIG AP
TOPS:
బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ప్రారంభం
ఆర్ఆర్‌బి, గ్రూప్-డి పరీక్షలు రాసే అభ్యర్థులకు శిక్షణ
ఈ నెల 25 నుంచి 60 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని వెల్లడి
నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ డైరెక్టర్ సూచన
నిరుద్యోగ యువతకు ఒక పెద్ద అవకాశాన్ని బీసీ స్టడీ సర్కిల్ అందిస్తోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, గ్రూప్ -D పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో SSCలో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ పొందేందుకు అర్హులని తెలిపింది. కర్నూలు బీసీ స్టడీ సర్కిల్ కి స్వయంగా వచ్చి తమ దరఖాస్తులను అందజేయాలని తెలిపింది. నిబంధనల మేరకు ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 25 నుంచి 60 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని వెల్లడించింది. శిక్షణలో ఉచిత మెటీరియల్ తో పాటు స్టైఫండ్ అందజేయనున్నట్లు ప్రకటించింది. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ డైరెక్టర్ కోరారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు.
