KONASEEMA
అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొబ్బరి రుచితో కూడిన వంటలు కోనసీమ ప్రత్యేకత.
కొబ్బరి పాలు, కొబ్బరి తురుముతో చేసే కూరలు ఎక్కువగా ఉంటాయి.
పూతరేకులు, పొలీ వంటి స్వీట్లు కూడా ప్రసిద్ధి.
పీత కూర, రొయ్యల వంటలు ఇక్కడి ప్రత్యేకత.
తీయని రుచులతో కోనసీమ ఆహారం ప్రత్యేక గుర్తింపు పొందింది.
దేశవ్యాప్తంగా 16వ జనగణనకు సన్నాహాలు
జనాభా లెక్కల సేకరణపై అధికారులకు శిక్షణ
డిజిటల్ విధానంలో ఈసారి జనగణన నిర్వహణ
ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం
మే 1 నుంచి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మొదలు
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 16వ జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. 2027 జనాభా లెక్కల సీనియర్ పరిశోధన అధికారి ఎం.బి. రమాదేవి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో మూడు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణన దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తి, జనాభా వంటి కీలక గణాంకాలు జనగణన ఆధారంగానే నిర్ణయించబడతాయని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కేటాయింపులో కూడా జనాభా కీలక ప్రమాణమని పేర్కొన్నారు.
ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుందని, మే 1 నుంచి హౌస్ లిస్టింగ్ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంటుందని, ప్రతి ఎన్యూమరేటర్ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. మూడు రోజులపాటు జరిగే ఈ శిక్షణలో జిల్లా, మండల స్థాయి అధికారులకు జనగణన విధివిధానాలు, హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, డేటా సేకరణ విధానం, డిజిటల్ యాప్‌ల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
