KONASEEMA GOOD MORNING AP
కోనసీమ జిల్లా
గోదావరి నది విభజనతో ఏర్పడిన ద్వీప ప్రాంతం ఇది.
కొబ్బరి తోటల వల్ల “ఆంధ్ర కేరళ”గా పిలుస్తారు.
నదీ మార్గాల్లో బోటు ప్రయాణం ప్రత్యేక ఆకర్షణ.
పచ్చని గ్రామాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
నదీ వ్యవసాయం ప్రధానంగా జరుగుతుంది.
సాంప్రదాయ జీవన విధానం కొనసాగుతోంది.
ప్రకృతి సోయగాల నిలయం
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
పంచ సూత్రాలతో వ్యవసాయం పండగలా మారుతోందని వెల్లడి
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు మేలు జరుగుతోంది: సత్యానందరావు
కొత్తపేట మండలంలో రైతన్నా మీకోసం ఏర్పాటు
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది: బండారు సత్యానందరావు
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పంచసూత్రాలతో వ్యవసాయం పండుగలా మారుతోందన్నారు. కొత్తపేట మండలం పలివెల సేరిపాలెంలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతన్నా మీకోసం కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 20వేలను మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతన్న మీకోసం ద్వారా పంచ సూత్రాలతో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని తెలిపారు.అగ్రిటెక్ లో భాగంగా ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు మొదలైనవి సబ్సిడీపై అందిస్తుందన్నారు. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్నారు. అన్నదాతల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్
వెంకట్ అందిస్తారు.
