• Advertise
  • Careers
  • About Us
  • Contact
Thursday, September 3, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home తాజా వార్తలు

Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి YSRతో పోలికే లేదు: కొండా సురేఖ

కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు.

by YK TV @ Internet Desk
September 3, 2026
in తాజా వార్తలు, తెలంగాణ, పాలిటిక్స్
0
Konda Surekha

Konda Surekha

0
SHARES
3
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

Konda Surekha: మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోల్పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని ఆమె స్పష్టం చేశారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించే ముందు కనీసం తన వాదన వినాల్సిన అవసరం ఉందని కొండా సురేఖ పేర్కొన్నారు. తాను నిజంగా తప్పు చేసి ఉంటే చర్య తీసుకున్నా బాధపడేదాన్ని కాదని, కానీ తన వివరణ తీసుకోకుండానే నిర్ణయం తీసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరిసారిగా తన మాట చెప్పుకునే అవకాశం ఇస్తారని, కానీ తనకు మాత్రం అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె వాపోయారు.

మంత్రివర్గం నుంచి తనను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి తాను రాసిన లేఖలను మీడియా ముందు విడుదల చేశారు. ఒకవేళ తనను రాజీనామా చేయాలని అడిగి ఉంటే తానే స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేసేదాన్నని తెలిపారు. తన వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తనను బర్తరఫ్ చేయకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతానని అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించారు.

తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడాన్ని కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. తన కుమార్తె స్వతంత్ర మహిళ అని, ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలిపారు. కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కొండా సురేఖ.. వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుందని ఏఐసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. తనపై మాత్రం కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నానని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి పాలన, నాయకులతో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కూడా కొండా సురేఖ విమర్శలు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నాయకులు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా కమ్యూనికేషన్ ఉండేదని గుర్తుచేశారు. ప్రజలతో, పార్టీ నాయకులతో వైఎస్సార్‌కు ఉన్నంతగా రేవంత్ రెడ్డికి కమ్యూనికేషన్ లేదని ఆమె వ్యాఖ్యానించారు. నాయకులతో సీఎం మరింతగా మమేకం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత తాను రేవంత్ రెడ్డినే ఎక్కువగా అభిమానించానని కొండా సురేఖ తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని, ముఖ్యమంత్రి కావాలని తానే ముందుగా కోరుకున్నానని గుర్తుచేశారు. ఈ విషయాలను సీఎం కూడా గుర్తుంచుకోవాలని అన్నారు.

తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వివక్ష చూపించారని కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రి కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారని, తన శాఖ అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహించారని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడంలో వెనుకడుగు వేయబోనని ఆమె స్పష్టం చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని తెలిపారు. ఇకపై సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు.

తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని కొండా సురేఖ అన్నారు. అయితే తన కోసం డాక్టర్ జి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా మంత్రి పదవి కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం లేదని, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ కొనసాగిస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

YK TV @ Internet Desk

YK TV @ Internet Desk

Next Post
Rashmika Mandanna

Rashmika Mandanna: దేశంలోనే నంబర్ 1 హీరోయిన్‌గా రష్మిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us