KRISHNA
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా తీర ప్రాంత మైదాన భూభాగంలో ఉంది.
కృష్ణా నది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది.
డెల్టా ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి.
సముద్ర తీర ప్రాంతం తూర్పున విస్తరించింది.
నది–డెల్టా మైదానాలు కృష్ణా జిల్లా ప్రత్యేకత
డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం
కలెక్టర్ డీకే బాలాజీ, సెర్ప్ అధికారులు కలిసి ప్రత్యేక ప్రణాళికలు
ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం లక్ష్యంగా విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు
కృష్ణా జిల్లాలో డ్వాక్రా మహిళలను వ్యాపార రంగంలో ముందుకు తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించి వారి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సెర్ప్ అధికారులు కలిసి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం లక్ష్యంగా విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాయి.
విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న ఈ సమావేశంలో డ్వాక్రా మహిళలు మరియు బయ్యర్ల మధ్య పరస్పర చర్చలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఈ సమావేశంలో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు మరింత సమాచారం అందిస్తారు.
