KURNOOL (రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్)
కర్నూలు జిల్లా
కర్నూలు ప్రాంతంలో రాయలసీమ కార వంటలు ప్రసిద్ధి.
రాగి సంకటి, మటన్ కూరలు ప్రధాన ఆహారం.
పచ్చళ్ళు, కారంగా ఉండే కూరలు ఎక్కువగా వాడుతారు.
పల్లె సంస్కృతి ప్రతిబింబించే వంటలు కనిపిస్తాయి.
రాయలసీమ రుచిని చూపించే ఆహారం కర్నూలు ప్రత్యేకత.
కర్నూలు రైతుబజార్ విస్తరణ పనులకు టెండర్‌ల గందరగోళం
రూ.6 కోట్ల పనులకు మొదటి టెక్నికల్ బిడ్‌లో కాంట్రాక్టర్లు అనర్హులు
ముగ్గురు కాంట్రాక్టర్లు సాంకేతిక కారణాలతో అవుట్
రైతుల కోరికతో విస్తరణకు సీఎం ఆదేశాలు
రెండోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ
ఈసారైనా కాంట్రాక్టర్లు అర్హత సాధిస్తారా అన్న సందేహాలు
రాష్ట్రంలో అతిపెద్ద రైతుబజార్ విస్తరణకు అడ్డంకులు
దేవుడు వరమిచ్చిన పూజారి కనుకరించడు అన్న చందంగా మారింది అన్నట్లుగా మారింది కర్నూలు రైతు బజార్ పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూల్లోని రైతుబజార్ని సందర్శించిన సమయంలో రైతు బజారు విస్తరించాలని రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రైతుల కోరిక మేరకు 6.5 కోట్ల రూపాయల తో విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద రైతు బజారుగా గుర్తింపు పొందిన కర్నూల్ సి.క్యాంప్ సెంటర్ రైతు బజార్ విస్తరణ పనులకు పిలిచిన టెండర్ పిలుపులో భాగంగా మొదటి టెక్నికల్ బిడ్ లో కాంట్రాక్టర్లు థాఖలు చేసిన షెడ్యూల్ పరిశీలించగా. ముగ్గురు సాంకేతిక కారణాలతో అర్హత సాధించలేకపోయారు. .
గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ లోని ఇంజనీరింగ్ విభాగం రూ 6 కోట్ల రూపాయల పిలిచిన టెండర్లు పిలుపులో కాంట్రాక్టర్లు అర్హత సాధించలేకపోవాటముతో మరో సారి రెండవ సారి అర్హులైన కాంట్రాక్టర్లను టెండర్ పిలుపులో పాల్గొనాలని. రెండవ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఈసారైనా అర్హులైన కాంట్రాక్టర్లు టెండర్ పిలుపులో అర్హత సాధిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.


