KURNOOL
కర్నూలు జిల్లా
ఈ జిల్లాలో పత్తి, వేరుశెనగ ప్రధాన పంటలు.
అదనంగా వరి, పప్పుధాన్యాలు కూడా సాగుతాయి.
తుంగభద్ర మరియు ఇతర జలవనరులు వ్యవసాయానికి సహాయపడుతున్నాయి.
వర్షాధార వ్యవసాయం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.
వ్యవసాయం ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో ముఖ్య భాగం.
అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుల నిరసన
4 వేల మంది కార్మికులు పనులు బహిష్కరణ
కాంట్రాక్ట్ సంస్థలపై శ్రమ దోపిడీ ఆరోపణలు
పోలీసులతో తోపులాట – ఉద్రిక్త పరిస్థితి
భారీ బందోబస్తు – యాజమాన్యంపై విమర్శలు
నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ఉన్న UltraTech Cement పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు నాలుగు వేల మంది కార్మికులు గత రెండు రోజులుగా పనులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థలు వేధింపులకు గురి చేస్తున్నాయని, శ్రమ దోపిడీ జరుగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
లేబర్ కాలనీ నుంచి పరిశ్రమ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇక పూర్తి వివరాలను మా రిపోర్టర్ మురళీకృష్ణ అందిస్తున్నారు…
