RAYALASEEMA GOOD MORNING AP
రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ ప్రధాన పంట.
అదనంగా పత్తి, వరి పంటలు కూడా సాగుతాయి.
కొన్ని ప్రాంతాల్లో మామిడి, బొప్పాయి తోటలు ఉన్నాయి.
వర్షాధార వ్యవసాయం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.
వ్యవసాయం ఈ ప్రాంత రైతుల జీవనాధారంగా కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం
ముమ్మరంగా కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన
రెండు వారాల్లో 30 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకున్న రాష్ట్రాలు
శ్రీశైలం జలాశంలో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పరి ధిలో ఉన్న కుడి, ఎడమ గట్టు భూగర్భ జలవి ద్యుత్ కేంద్రాలలో ముమ్మరంగా విద్యుదుత్పాదన తో పాటు సాగు, తాగు నీటి అవసరాలకు నీటి వినియోగం కొనసాగుతుంది. రోజుకు మూడు టీఎంసీల నీటి వినియోగం జరుగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో రెండు వారాల వ్యవధిలో 30 టీఎంసీలకుపైగా నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. విద్యుత్ ఉత్పత్తిలో రెండు విద్యుత్ కేంద్రాల్లో పోటీపడి ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఇలాగే కొనసాగితే మరో రెండు వారాల్లో డ్యాంలో నీటి నిల్వలు 40 టీంసీలకు చేరుకునే అవకాశం ఉందని, దీంతో డెడ్స్టోరేజికీ పడిపోవడం, మరో మూడు నెలలు తీవ్ర నీటి ఎద్దడి తప్పదని కొందరు నీటిపారుదలశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు.
