VISAKHAPATNAM
విశాఖపట్నం జిల్లా
ఇది విశాఖపట్నం జిల్లా!
తూర్పు ఘాట్ పర్వతాలు సముద్ర తీరంతో కలిసి అద్భుత దృశ్యం ఇస్తాయి.
కైలాసగిరి కొండపై నుంచి నగరం అద్భుతంగా కనిపిస్తుంది.
సింహాచలం కొండపై లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది.
ఆర్కే బీచ్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.
ప్రకృతి, పరిశ్రమలు కలిసిన మహానగరం.
స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం
కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్ణయాల అమలుపై సమీక్ష
జీరో పావర్టీ లక్ష్యంగా సమగ్ర చర్యలు
గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి
స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లా స్థాయిలో కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులు సూచనలు అందుకుంటున్నారు. రాష్ట్రాన్ని జీరో పావర్టీ దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం నిర్ణయించిన పది సూత్రాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
