యువ హీరో తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్’ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2021లో వచ్చిన ‘జాంబీ రెడ్డి’తో తెలుగు తెరకు జాంబీ జానర్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. తెలుగుకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను మల్టీలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ‘బిగ్గర్, బ్యాడర్ & బ్లడీర్’ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈసారి కథను అందిస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘రాణా నాయుడు’ వంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ వర్మ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హుస్సేన్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్ణ్ వర్మ కలిసి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తేజ సజ్జాతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి షనయా కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
‘జాంబీ రెడ్డి’కి ఆకట్టుకునే సంగీతాన్ని అందించిన గౌర హరి ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డెడ్ ఆర్ అలైవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ‘Zombie Reddy 2: NXT LVL’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. మరింత భారీ స్కేల్, కొత్త పాత్రలు, పాన్ ఇండియా అప్పీల్‌తో ఈ సీక్వెల్ ప్రేక్షకులకు సరికొత్త జాంబీ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్ధమవుతోంది.


