సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు పాత సినిమా బకాయిల వ్యవహారం షాక్ ఇచ్చింది. సుమారు రూ.1.32 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ముంబైలో టెక్నీషియన్లు సమ్మెకు దిగినట్లు సమాచారం. దాదాపు తొమ్మిదేళ్లుగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని టెక్నీషియన్లు ఆరోపించారు. సమ్మె కారణంగా ఆర్జీవీకి సుమారు రూ.1.11 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే టెక్నీషియన్ల ఆందోళన నేపథ్యంలో స్పందించిన ఆర్జీవీ.. కొన్ని గంటల్లోనే బకాయిలను క్లియర్ చేసినట్లు సమాచారం. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


