ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో ఈనెల 24న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, కలెక్టర్ వెట్రీ సెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ తదితర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గం, సభాస్థలి ప్రాంతాలను తనిఖీ చేశారు. పటిష్ట భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర ప్రణాళికలపై అధికారులకు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు.


