కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గోదావరిలోకి దూకే ముందు నూకరాజు ఫోన్లు, పర్సును కారులోనే వదిలేసినట్లు గుర్తించారు. వాట్సప్ మెసేజ్‌లను తొలగించినట్లు పోలీసులు గుర్తించడంతో సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. సౌజన్య ఫోన్‌ను విశ్లేషిస్తే మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సాదిక్ ఖాన్ కాల్ డేటాను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు


