ఇండిగో ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టికెట్ బుకింగ్, ఆన్లైన్ చెక్ఇన్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ సమస్య కారణంగా ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఇండిగో సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. అత్యవసర ప్రయాణికులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించింది. అసౌకర్యానికి ఇండిగో విచారం వ్యక్తం చేసింది.


