నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డబ్బు కోసం ఈ ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెల 11న మాస్క్, హుడీ ధరించి రూపారెడ్డి ఇంటికి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఆమె ప్రతిఘటించడంతో మాస్క్ తొలగిపోయి గుర్తుపట్టడంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని రూ.2.20 లక్షలు తీసుకుని బయట ఉన్న మరో విద్యార్థికి రూ.40 వేలు ఇచ్చాడు. చోరీలు, జల్సాలకు అలవాటుపడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో రూ.1.60 లక్షల నగదుతో పట్టుబడగా, దానిపై రక్తపు మరకలు కనిపించడంతో నిజం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.


