రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్, పర్మినెంట్ మేగ్నెట్స్ అభివృద్ధిపై మంత్రి కొల్లు రవీంద్రతో ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి రేర్ ఎర్త్ మినరల్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ను కేరాఫ్ అడ్రస్‌గా మార్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని ప్రొఫెసర్లు సూచించారు. పర్మినెంట్ మేగ్నెట్స్ను స్థానికంగానే తయారు చేస్తే రాష్ట్రానికి అపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్‌పై ఏపీలో ప్రత్యేక కోర్సులను ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలోని రేర్ ఎర్త్ మినరల్స్‌ను సద్వినియోగం చేసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టెక్నాలజీ, ప్రాసెసింగ్ రంగాల్లో ఏపీకి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీ–2026 ద్వారా కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. త్వరలోనే ఐఆర్ఈఎల్ కేంద్రాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


