హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన కన్నడ స్టార్ హీరో యశ్ ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. భారీగా అభిమానులు, విద్యార్థులు తరలిరావడంతో వేదిక సమీపంలో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు యువకులు క్లియర్ వ్యూ కోసం ఫ్లడ్ లైట్ స్తంభాలు, భారీ సౌండ్ బాక్సులకు ఏర్పాటు చేసిన ఐరన్ పోల్స్‌పైకి ఎక్కారు.
యువకులు ఎక్కువ సంఖ్యలో పోల్స్‌పైకి ఎక్కడంతో బరువు తట్టుకోలేక భారీ సౌండ్ బాక్స్ అమర్చిన ఓ ఐరన్ పోల్ ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో అక్కడున్న వారిలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదం జరిగిన సమయంలో హీరో యశ్ వేదికపై ప్రసంగిస్తున్నారు. పోల్ కిందపడటాన్ని గమనించిన ఆయన వెంటనే తన ప్రసంగాన్ని ఆపేశారు. అక్కడ ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అంతా సురక్షితంగా ఉన్నారా? ఏం జరిగిందో చూడాలని నిర్వాహకులను కోరారు. అంతేకాకుండా లైటింగ్ స్టాండ్లు, మైక్ పోల్స్‌పైకి ఎక్కిన యువకులు వెంటనే కిందకు దిగాలని వేదికపై నుంచే సూచించారు. వేలాది మంది హాజరైన కార్యక్రమంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, క్రౌడ్ కంట్రోల్లో నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు చర్యలు చేపట్టారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రమాదం కారణంగా ఎన్‌హెచ్-16పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెందుర్తి ఎస్ఐ భాస్కరరావు సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


