Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లో పది మంది సెలబ్రిటీలతో పాటు ఆరుగురు కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ సీజన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక బిగ్ బాస్ అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది. సోమవారం నుంచి బిగ్ బాస్ బజ్ కూడా ప్రారంభం కానుంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేస్తూ.. వారి జర్నీ, హౌస్‌లో ఎదురైన అనుభవాలు, వివాదాలు, ఆట తీరుపై ప్రశ్నలు సంధించనున్నారు. ఈసారి బజ్‌కు నటుడు శివాజీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఇప్పటికే బజ్‌కు సంబంధించిన ప్రోమోను శివాజీ విడుదల చేశారు. ‘‘బిగ్ బాస్ బజ్ ఆట కాదు.. వేట’’ అంటూ ప్రోమోను ఆసక్తికరంగా ఎలివేట్ చేశారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, రాత్రి 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్‌లో బిగ్ బాస్ బజ్ ప్రసారం కానుంది. మరోవైపు బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్స్ సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు, శని, ఆదివారాల్లో వీకెండ్ ఎపిసోడ్స్ రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్‌గా దేబ్జానీ మోదక్, త్రిగుణ్, ఝాన్సీ, సుధీర్ టాక్స్, అమన్, చైత్ర రాయ్, ఆటో రామ్ ప్రసాద్, శాలిని, టెంపర్ వంశీ, శ్రష్టి, నరేష్, ఆర్‌జే చరణ్, కృష్ణుడు, వర్షిణి సౌందర్‌రాజన్, రోహిత్, ముఖేష్ గౌడ ఎంపికయ్యారు. మరి ఈసారి ప్రేక్షకులను తమ ఆటతో కంటెస్టెంట్స్ ఎలా అలరిస్తారో వేచి చూడాలి.


