మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు అదిరే ఆరంభం చేసింది. పసికూన థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. అయితే ఈ విజయానికి భారత సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటిన దీప్తి.. అద్భుతమైన బౌలింగ్‌తో థాయ్‌లాండ్ బ్యాటర్లను వణికించింది. కేవలం ఏడు బంతులు మాత్రమే వేసిన దీప్తి శర్మ.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా మూడు వికెట్లు తీసింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత బౌలర్‌గా సున్నా పరుగులకే అత్యధిక వికెట్లు తీసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడిన దీప్తి 171 వికెట్లు పడగొట్టింది. దీంతో థాయ్‌లాండ్ బౌలర్ పుత్తావోంగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. పుత్తావోంగ్ 109 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతోంది. థాయ్‌లాండ్‌పై అద్భుతమైన స్పెల్‌తో మూడు వికెట్లు తీసిన దీప్తి శర్మ.. ఒకే మ్యాచ్‌లో విజయంలో భాగస్వామ్యం కావడమే కాకుండా, రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుని భారత క్రికెట్లో మరో మైలురాయిని అందుకుంది.


