ANANTHAPURAM GOOD MORNING AP
అనంతపురం జిల్లా – ఇంట్రో
ఇదే రాయలసీమ గర్వం అనంతపురం!
లేపాక్షి ఆలయం, అక్కడి ఏకశిలా నంది ‘చూడగానే ఆశ్చర్యం’ కలిగిస్తాయి.
గ్రౌండ్‌నట్ సాగు ఇక్కడ ‘బాగానే’ జరుగుతుంది.
ఇప్పుడు సౌరశక్తి ప్రాజెక్టులతో కొత్త అభివృద్ధి కనిపిస్తోంది.
చరిత్ర, సంస్కృతి కలిసిన నేల ఇది బాబోయ్!”
TOPS:
కసాపురం ఆంజనేయ స్వామి గర్భగుడి కూల్చివేతపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందన
జేసీబీ సాయంతో ఆలయాన్ని కూల్చివేస్తున్నారని తప్పుడు ప్రచారం
అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయంలో కూల్చివేతలు చేపట్టారని వెల్లడి
హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లుగా తప్పుడు ప్రచారం
ANANTHAPURAM GOOD MORNING AP
అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గర్భగుడి కూల్చివేత అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. వారం రోజుల క్రితం జేసీబీ సాయంతో ఆలయాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొందరు వీడియోలను పోస్ట్ చేశారు. ఆలయ అభివృద్ధికి కోసం చేపడుతున్న పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారని తేలింది. కొంతమంది తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. వాస్తవానికి దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం సహా పలు పనుల్ని డిపార్ట్మెంట్ ప్లాన్, ఎస్టిమేషన్ ప్రకారం దాతల సాయంతో పనులు చేపట్టారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం పేరుతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.
