KRISHNA GOOD MORNING AP
కృష్ణా జిల్లా – ఇంట్రో
ఇది కృష్ణా జిల్లా!
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం.
ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదిపై అద్భుత నిర్మాణం.
కొండపల్లి బొమ్మలు ‘చాలా అందంగా’ ఉంటాయి.
కుచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం అయిన నేల ఇదే.”
TOPS:
గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
సాయంత్రం 5 గంటలకు రైతులతో సీఎం ముఖాముఖి
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్న సీఎం
సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అధికార యంత్రాంగం
KRISHNA GOOD MORNING AP
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం మండలం మాదలవారి గూడెం పంచాయితీలో రైతులతో ముఖాముఖి కానున్నారు. రైతులతో నేరుగా పంటల గురించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం రైతులకు సీఎం సలహాలు సూచనలు చేయనున్నారు. ఈ సందర్భంగా మాదలవారి గూడెంలో పలు రకాల పంటలను సీఎం పరిశీలించనున్నారు. అలాగే రైతుల సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు భద్రతా ఏర్పాట్లను అధికార యంత్రాంగం పరిశీలించింది.
సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అలాగే భద్రతా ఏర్పాట్లు అన్ని అంశాలను జిల్లా అధికార యంత్రాంగం ఆ ప్రాంతాన్ని రెండు రోజుల నుంచి క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు , ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జిల్లా అధికార యంత్రాంగం,తదితరులు సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు.
