• Advertise
  • Careers
  • About Us
  • Contact
Monday, September 7, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home ఆంధ్రప్రదేశ్

Polavaram: ఉత్తరాంధ్రను తాకిన గోదావరి జలాలు.. సీఎం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలు

by YK TV @ Internet Desk
September 2, 2026
in ఆంధ్రప్రదేశ్, తాజా వార్తలు
0
Polavaram Left Canal

Polavaram Left Canal

0
SHARES
4
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

Polavaram Left Canal: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు. అంతకుముందు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నారాయణ, కొలుసు పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు. పాయకరావుపేటకు చేరుకున్న సీఎం చంద్రబాబు ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ పోలవరం ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, రైతులు ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

ఎన్నో అడ్డంకులు దాటుకుని ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం వెనక ఇంజనీరింగ్ నిపుణుల కృషి ఎంతో ఉంది. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ పోలవరం ఎడమ ప్రధాన కాలువను నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా.. ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్‌ ద్వారా నీటిని తరలించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంతో అనుసంధానం చేయడంతో గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకున్నాయి.

గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరడంతో ఈ ప్రాంత వ్యవసాయానికి భారీ ప్రయోజనం కలగనుంది. ప్రాజెక్టు తొలి దశలో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో సుమారు 5.23 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాంధ్రలో సాగునీటి కొరతను తగ్గించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకడంతో ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సాగునీరు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న గోదావరి జలాల రాక ఇప్పుడు సాకారమైంది. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనుసంధానంతో గోదావరి నీరు ఈ ప్రాంతానికి చేరుకోవడం రాష్ట్ర సాగునీటి చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకిన ఈరోజు చరిత్రలో నిలిచిపోనుంది.

 

YK TV @ Internet Desk

YK TV @ Internet Desk

Next Post
Pawan Kalyan

Pawan Kalyan: తమ్ముడిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది: చిరంజీవి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us