KRISHNA GOOD MORNING AP
కృష్ణా జిల్లా
ప్రకాశం బ్యారేజ్ ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచింది.
కుచిపూడి నృత్యం ఇక్కడి నుంచే వెలుగులోకి వచ్చింది.
కనకదుర్గమ్మ ఆలయం ప్రముఖ క్షేత్రం.
దసరా సమయంలో భారీ రద్దీ ఉంటుంది.
కృష్ణా నది పంటలకు ప్రధాన ఆధారం.
నగరాభివృద్ధి వేగంగా జరుగుతోంది.
సంస్కృతి, అభివృద్ధి కలిసిన జిల్లా.
మచిలీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వినతులు
ప్రాంతీయ విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి
తనదైన శైలిలో మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర
ప్రభుత్వ కళాశాల ఏర్పాటుపై మంత్రి సదుద్దేశంతో ఉన్నారని స్థానికులు నమ్మకం వ్యక్తం
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విన్నపాలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన మచిలీపట్నం గతం ఎంతో ఘన కీర్తిగా వెలుగొందింది. మచిలీపట్నాన్ని తనదైన శైలిలో తన మార్కుతో అభివృద్ధి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నడుం బిగించారే నమ్మకం బందరు ప్రాంతవాసుల్లో ఉంది. దానిలో భాగంగానే బందరుతో పాటు పరిసర ప్రాంత ప్రజానీకం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మంత్రి నారా లోకేష్ తో సంప్రదించి మచిలీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి ఉన్న ప్రాధాన్యత ఇక్కడి విద్యార్థుల అవసరతను దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికే సదుద్దేశంతో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర ఆ దిశగా చర్యలు తీసుకుంటారనే నమ్మకం స్థానికుల్లో కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు.
