


ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలియజేస్తూ వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.


